Breaking News

శ్రీవారిని దర్శించుకున్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమలకు విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. జస్టిస్ సూర్యకాంత్ కి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఆలయ చైర్మన్ బి. ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవి చంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పి ఎల్. సుబ్బారాయుడు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్చకులు మేళతాళాల మధ్య వేద మంత్రాలు నడుమ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం తరువాత భారత ప్రధాన న్యాయమూర్తి ని అర్చకులు శేష వస్త్రం కప్పిన అనంతరం రంగనాయకుల మండపంలో వేద‌ పండితులు వేదాశీర్వచనం అందజేశారు.

అటు తరువాత టీటీడీ చైర్మన్ బి. ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవి చంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తీర్థప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ వరహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *