Breaking News

వేట్లపాలెంలో జరిగిన సంఘటన అత్యంత దురదృష్టకరం..

-బాణాసంచా తయారీకి కఠినమైన నిబంధనలు..
-రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్

కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం వేట్లపాలెంలో జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించి అనంతరం పాత్రికేయలతో మాట్లాడారు.
‌ ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. వేట్లపాలెం సంఘటనలో 20 మంది చనిపోగా ఆదివారం లావరాజు అనే మరో వ్యక్తి చనిపోవడం బాధాకరమన్నారు. రాయవరంలో జరిగిన సంఘటనలో 10మంది చనిపోయిన అనంతరం బాణసంచా తయారీ కేంద్రాల నిర్వహణలో నిబంధనలు కఠినతరం చేయడం జరిగిందన్నారు. మండల స్థాయిలో తహసీల్దార్ ఎస్సై, ఫైర్, లేబర్ అధికారులతో కూడిన కమిటీలను నియమించడం జరిగిందన్నారు. ఈ అధికారులు ప్రతి 3 నెలలకు ఒకసారి సంబంధిత బాణాసంచా తయారీ కేంద్రాలు తనిఖీ చేయవలసి ఉందన్నారు. కార్మిక శాఖ నుండి ఎల్ఈ-3 అనుమతి పొందవలసి ఉందన్నారు. అదేవిధంగా తయారీ కేంద్రం నుంచి స్టోరేజ్ పాయింటుకు 45 మీటర్లు దూరం ఖచ్చితంగా ఉండాలన్నారు. డ్రై ప్లాట్ ఫారం సాధ్యమైనంత దూరంగా ఉండాలన్నారు. బాణసంచా తయారీకి ఉపయోగించే ముడి సరుకు 15 కేజీల మించి నిలువ ఉంచకూడదని నిబంధనలో పేర్కొనడం జరిగిందని ఆయన తెలిపారు. అవిధంగా బాణసంచా తయారీ కేంద్రాల్లో కార్మికుల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని అన్ నేమెడ్ ఇన్సూరెన్స్ ఉండాలని స్పష్టంగా పేర్కొనడం జరిగిందన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 488 బాణాసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయని, వాటి యాజమాన్యాలు కొత్తగా రూపొందించిన నిబంధనలు సడలించాలని కోరడం జరిగిందన్నారు. అయినప్పటికీ నిబంధనలకు అనుగుణంగా ఎన్ఓసీ జారీ కష్టతరం చేసేమన్నారు. అయితే ప్రమాదం జరిగిన ఈ ఫైర్ వర్కర్స్ లో జాతర ఉందని యజమాని డబ్బు కోసం స్వార్థంతో అధిక మొత్తంలో బాణాసంచాను తయారు చేయడం జరిగిందన్నారు. అయితే ఈ కేంద్రంలో ఎనిమిది మంది కార్మికులకు అనుమతి పొందగా, 30 మంది కార్మికులతో పని చేయించడం జరుగుతుందన్నారు. వీరిలో ఎక్కువగా ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వారున్నారని పైగా వీరిలో అన్ స్కిల్డ్ కార్మికులతో యజమాని పని చేయించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ ప్రమాదం కిలోమీటరు దూరం శబ్దం వినిపించడం ప్రమాద తీవ్రతను ఊహించవచ్చన్నారు. సంఘటన జరిగిన విషయాన్ని తెలిసిన వెంటనే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎటువంటి ఎస్కార్ట్ లేకుండా, ఎటువంటి ఆర్భాటాలకు తావు లేకుండా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, ప్రమాద జరిగిన తీరును పరిశీలించి, అనంతరం మృతుల కుటుంబాలను, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి బాధితులకు అండగా నిలవడం జరిగిందన్నారు. బాధిత కుటుంబాలకు రూ.20 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించడంతోపాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి తెలిపారు.
ఈ సంఘటనను రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకోవడం జరిగిందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులను ఆదేశించారన్నారు. యాజమాన్యం ఆస్తులను జప్తు చేసి, బాధితులకు అందజేస్తామని ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగిందని మంత్రి సుభాష్ తెలిపారు. దేశంలోని ఎక్కువగా బాణాసంచా తయారీ జరుగుతున్న శివకాశికి రాష్ట్రం నుండి ఒక బృందాన్ని పంపి అక్కడ వారు తీసుకుంటున్న రక్షణా చర్యలను పరిశీలించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *