గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి, ఎన్టీఆర్ జిల్లాలో పర్యటన ముగించుకుని ఢిల్లీకి పయనమయ్యేందుకు ఆదివారం రాత్రి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి శ్యామలరావు, రాష్ట్ర హైకోర్టు పలువురు న్యాయమూర్తులతో పాటు కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి జి గోపి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ వీ విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, విమానాశ్రయం డైరెక్టర్ ఎం ఎల్ కే రెడ్డి, టెర్మినల్ ఇన్చార్జి అంకిత్ కుమార్, ప్రోటోకాల్ డైరెక్టర్ మోహన్ రావు, విమానాశ్రయం సిఎస్ఓ కె ధర్మేంద్ర తదితరులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఘనంగా వీడ్కోలు పలికారు.
Prajavartha Online Telugu News