Breaking News

ప్రజా ఫిర్యాదులకు నిర్ణిత గడువులో సంతృప్తికరమైన పరిష్కారాలను అందిస్తున్నాం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా ఫిర్యాదులకు నిర్ణిత గడువులో సంతృప్తికరమైన పరిష్కారాలను అందిస్తున్నాం అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో నిర్వహించారు. జోనల్ కార్యాలయాల్లో జరుగుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించారు.

ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి స్వీకరించి ఫిర్యాదులకు అధికారులు అందరూ నిర్ణీత గడువులో సంతృప్తికరమైన పరిష్కారాన్ని అందించేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. దివ్యాంగుల కోసం ప్రధాన కార్యాలయంలో వీల్ చైర్లు తక్షణమే ఏర్పాటు చేయాలని, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించగా, వెంటనే వెహికల్ డిపో నుండి రెండు వీల్ చైర్లు ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంచారు, అధికారులు వారితో మాట్లాడి వారి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు . ఒకవైపు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించడమే కాకుండా మరోవైపు అధికారులతో సమీక్షించారు. నిరంతరం దోమల నిర్మూలన చర్యలు చేపడుతూనే ఉండాలని, ప్రతిరోజు త్రాగునీటి పరీక్షలు చేస్తుండాలని, ప్రణాళిక బద్ధంగా వాటర్ ట్యాంకులను కడుగుతుండాలని, పన్ను వసూళ్లు సమర్ధవంతంగా చేయాలని అధికారులందరూ తమ తమ సిబ్బంది మీ పర్యవేక్షిస్తూ నగరాభివృద్ధిలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని కమిషనర్ అన్నారు.

ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 22 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 6, ఇంజనీరింగ్ 7, రెవిన్యూ 6, పి ఒ యుసిడి 1, హౌసింగ్ 1, హార్టికల్చర్ 1 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ కె.సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి.సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, అకౌంట్స్ ఆఫీసర్ సత్యనారాయణ, సూపర్డెంట్ ఇంజనీర్ (వర్క్స్) వి.చంద్రశేఖర్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, ఆర్ ఎఫ్ ఓ మాల్యాద్రి, ఎస్టేట్ ఆఫీసర్ ఏ. శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు గోపాల్ కృష్ణ, ప్రభాకర్, బయాలజిస్ట్ కామేశ్వరరావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *