-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పన్ను చెల్లింపులకు ఆదివారం కూడా క్యాష్ కౌంటర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను, ఖాళీ స్థలము పన్ను, నీటి పన్ను, డ్రైనేజి పన్ను మరియు వాటర్ మీటర్ పన్నులు చెల్లింపు కాలపరిమితి ది.31-03-2026తో ముగియుచున్నందున, బకాయిలు ఉన్న పన్నులను వెంటనే చెల్లించవలసినదిగా ప్రజలను కోరారు. ప్రజల సౌకర్యార్ధము నగరపాలక సంస్థ సర్కిల్స్-I, II, III నందలి క్యాష్ కౌంటర్లు మరియు విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయము నందలి పుర సేవ కేంద్రం నందు గలక్యాష్ కౌంటరు ది.03-03-2026 (మంగళవారము) నుండి ది.31-03-2026 (మంగళవారము)వరకు అన్ని దినములలో, శెలవు దినములతో సహా ఉదయం 9:00నుంచి సాయంత్రం06:00గంటల వరకు పనిచేయునని అన్నారు. కావున పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకొని పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించవలసినదిగా కోరారు.
Prajavartha Online Telugu News