Breaking News

ఇంద్రకీలాద్రి అభివృద్ధికి ప్రణాళికలు- ఏపీఐటీసీఓ (APITCO) బృందం పరిశీలన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
​ఇంద్రకీలాద్రి పై మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు APITCO లిమిటెడ్ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. ఈరోజు మధ్యాహ్నం విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్ సూచనల మేరకు,APITCO మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ మెహ్రా నేతృత్వంలోని ఈ బృందం ఆలయ అధికారులతో కీలక చర్చలు జరిపింది. ​ ప్రతిపాదిత నూతన క్యూ లైన్ కాంప్లెక్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ భవనానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) తయారీపై ఈ బృందం ఆలయ ఈఓ శీనానాయక్ మరియు చైర్మన్‌ బి. రాధాకృష్ణ (గాంధీ )తో చర్చించింది. ​అన్నదానం కాంప్లెక్స్ మరియు సెల్లార్ స్పేస్ వినియోగంపై బృందం కీలక సూచనలు చేసింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వారి సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ ప్రణాళికలు రూపొందుతున్నాయి. ఐదు దశాబ్దాల అనుభవం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ (APITCO) సేవలను ఆలయ అభివృద్ధికి వినియోగించుకునేలా చేయడంలో ఎంపీ కేశినేని కీలక పాత్ర పోషించారని బృందం పేర్కొన్నారు. ఆలయ ఆధ్యాత్మికత దెబ్బతినకుండా, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఆధునిక హంగులతో మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమాదేవి, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *