Breaking News

మహా కుంభాభిషేక పనులను సత్వరమే పూర్తి చేయాలి

-చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) మరియు ఈ.ఓ. సీనా నాయక్ ఆదేశం
-ఆలయ విమాన గోపురంపై జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహా కుంభాభిషేక మహోత్సవానికి సంబంధించి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి మరియు జీర్ణోద్ధరణ పనులను నిర్ణీత గడువులోగా, అత్యంత నాణ్యతతో పూర్తి చేయాలని ఆలయ Chairman బొర్రా రాధాకృష్ణ (గాంధీ) మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి (Special Grade Dy. Collector) సీనా నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం వారు కార్యనిర్వాహక ఇంజనీర్ (E.E) రామ మరియు డి.ఈ.ఈ (D.E.E) అశోక్ కుమార్లతో కలిసి ప్రధాన ఆలయ పైభాగంలోని విమాన గోపురం వద్ద జరుగుతున్న పనులను, ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మరియు ఈ.ఓ. మాట్లాడుతూ.. భక్తుల సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని, మహా కుంభాభిషేక కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ముఖ్యంగా విమాన గోపురం వద్ద జరుగుతున్న పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని, తుది మెరుగులు దిద్దే పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ప్రధాన ఆలయ శోభ ఉట్టిపడేలా, భక్తులకు కంటికి విందుగా ఉండేలా ఏర్పాట్లు ఉండాలని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *