మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా ఉంటూ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేరవేస్తూ ప్రసారమాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో 2026 27 సంవత్సరానికి నూతనంగా మంజూరైన మీడియా అక్రిడిటేషన్ కార్డులను మీడియా ప్రతినిధులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలను కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేయడంలో వారికి అవగాహన కలిగించడంలో ఎంతగానో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారమాధ్యమాలు ఎంతగానో తోడ్పడుతున్నాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడిటేషన్లు మంజూరు చేశామని ఇంకా ఎవరైనా సరే మిగిలి ఉంటే వారికి సంబంధించిన ఆధార పత్రాలు, అనుబంధ పత్రాలు జతపరిచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి యమ్.వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News