తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం, నెమలి గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థాన తిరునాళ్ల కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు. అలాగే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, సమర్థవంతంగా ప్రజలకు మరిన్ని సంక్షేమ పధకాలు అమలు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరింత శక్తి, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని స్వామివారిని కోరారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు, కమిటీ వారు గద్దె అనురాధ వేద మంత్రాలతో ఆశీర్వాదం అందించి, స్వామివారి చిత్రపటాన్ని స్మారకంగా అందజేశారు. కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.
ఆర్గానిక్ స్టాల్స్ ప్రారంభం
తిరునాళ్ల సందర్బంగా ఏర్పాటు చేసిన ఆర్గానిక్ ఉత్పత్తుల స్టాల్స్‌ను గద్దె అనురాధ ప్రారంభించారు. రసాయనరహిత వ్యవసాయం ప్రజారోగ్యానికి కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులు వినియోగం ద్వారా తమ ఆరోగ్యాలను కాపాడుకోవడంతోపాటు రైతుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ప్రజలను కోరారు. స్థానిక రైతులు తయారు చేస్తున్న ఆర్గానిక్ ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించి, వాటి వినియోగాన్ని ప్రజలు పెంచాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో చిట్టిబాబు, చేరుకూరి రాజేశ్వరరావు, రేగళ్ల లక్ష్మి అనీత, దుబ్బకు వెంకటేశ్వర్లు, మణికొండ రామకృష్ణ, గద్దె వెంకన్న, మల్లెల శ్రీనివాస్ గ్రామస్తులు, మహిళలు, యువత మరియు టిడిపి, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News