Breaking News

పీజీ ఆర్ఎస్ అర్జీలు సక్రమంగా పరిష్కారం లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పీజీ ఆర్ఎస్ అర్జీలు సక్రమంగా పరిష్కారం లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు గంగరాజు, లక్ష్మీ కుమారి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిజీఆర్ఎస్ లో ప్రజలు అందించిన అర్జీలను తొలుత సంబందిత అధికారులు పూర్తిగా పరిశీలించి పరిష్కార చర్యలకు నిర్దేశిత సమయాన్ని ఖచ్చితంగా తెలిపారన్నారు. నిబంధనల మేరకు పరిష్కారం కానీ సమస్యలను అర్జీ దారులకు అర్ధమయ్యేలా తెలిపాలన్నారు. అర్జీదారుల సమస్యలను సక్రమంగా పరిశీలించకుండా దీర్ఘకాలికంగా పరిష్కారానికి చర్యలు తీసుకొని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
పీ.జీ.ఆర్.ఎస్ కు మొత్తం 350 అర్జీలు అందాయి. అందులో రెవెన్యూ శాఖ కు సంబంధించి 161 అర్జీలు, ఇతర శాఖల అర్జీలు 229 అందాయి.
ప్రభుత్వం ఐ.వి.ఆర్.ఎస్ విధానంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకలపై అభిప్రాయాలను సేకరిస్తుందని జిల్లా కలెక్టర్ చెప్పారు. ప్రజలకు సంతృప్తికర సేవలు అందించాలని సూచించారు. ఎక్కడ లోపం ఉంటే అక్కడ నుండి సానుకూల అభిప్రాయం వ్యక్తం కాదని, దీనిని దృష్టిలో పెట్టుకుని క్షేత్ర స్థాయిలో ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని ఆదేశించారు. రెవిన్యూ అంశాలపై తహసీల్దార్లు మరింత శ్రద్ధ వహించాలని ఆదేశించారు. తాగునీరు, పారిశుధ్యం, సమస్యల పరిష్కారం, సేవలు అందించడం తదితర అన్ని విభాగాలలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ శంకరన్ హాలు వెలుపల వికలాంగుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, డిప్యూటీ కలెక్టర్ లు గంగ రాజు, డి.ఎం అండ్ హెచ్ ఓ డా. విజయలక్ష్మి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి. విజయ లక్ష్మి, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి, జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.దుర్గా భాయి, జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం భాషా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *