Breaking News

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 390 అర్జీలు

-ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) కు వచ్చిన అర్జీదారుల సమస్యలపై సకాలంలో పరిష్కారం చూపాలి
-జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) లో జిల్లా కలెక్టర్a అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం, మెడికల్ క్యాంప్, గ్రామాల నుండి వచ్చు అర్జీ దారులకు టి సరఫరా తదితర సౌకర్యాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు.

ఈ సందర్భంగా పీ జి ఆర్ ఎస్ లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఎ ఓపెనింగ్ లేకుండా అర్జిదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. పీ జి ఆర్ ఎస్ లో వచ్చు అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జిల్లా రెవిన్యూ అధికారి, జి. నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్ నాయక్,రోజ్ మాండ్ లతో కలసి ఫిర్యాదులను వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి, ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు.

శాఖల వారీగా అర్జీల వివరాలు :

రెవెన్యు – 250, రూరల్ పావర్టి – 24, పంచాయితీ రాజ్ – 23, పోలీస్ -21, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ – 12, సర్వే శాఖ- 12, సెకండరీ హెల్త్ – 6, స్కూల్ ఎడ్యుకేషన్- 5, తుడా- 4, విద్యుత్ శాఖ -3, పబ్లిక్ హెల్త్- 3, సివిల్ సప్లైస్- 3, జలవనరుల శాఖ- 3, రిజిస్ట్రేషన్ శాఖ – 3, ట్రైబల్ వెల్ఫేర్- 2, స్వర్ణ గ్రామం / స్వర్ణ వార్డు – 2, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్- 2, ఆర్ డబ్ల్యు ఎస్ -1, వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ -1, ఫుడ్ సేఫ్టీ -1, ఆర్ అండ్ బి- 1, దేవాదాయ శాఖ- 1, ఫ్యామిలీ వెల్ఫేర్ -1, ఆర్టిసి- 1, హౌసింగ్ కార్పోరేషన్ -1, కోఆపరేటివ్ సొసైటీ -1, ఐ.సి.డి.ఎస్. -1, పేదరిక నిర్మూలన సంస్థ – 1, స్కిల్ డెవలప్మెంట్ – 1 వెరసి మొత్తం 390 అర్జీలు రావడం జరిగిందని, సంబంధిత అధికారులు అందరు సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *