అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సియం ఎక్స్అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఫిబ్రవరి 28న సిఎస్ గా ఆయన పదవీ విరమణ చేయగా ప్రభుత్వం విజయానంద్ ను ముఖ్యమంత్రివర్యుల ఎక్స్అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో సోమవారం రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం మరియు టిటిడి వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనంతరం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా పలువురు ఉన్నతాధికారులు,సచివాలయ వివిధ విభాగాల అధికారులు,ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు విజయానంద్ కు పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News