విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశాల మేరకు ఎస్ ఆర్ ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర అధ్యాపకులు మరియు ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ కొల్లేటి రమేష్ జిల్లా సీఈవో స్టెప్ మరియు యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ గా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఎండి మరియు యువజన సర్వీసులు శాఖ కమిషనర్ భరణి ఐఎఫ్ఎస్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మరియు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ ఐఏఎస్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సీఈవో మరియు యూత్ వెల్ఫేర్ ఆఫీసు సిబ్బంది, ఎస్ ఆర్ ఆర్ కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ ఆదేశాలు ప్రకారం తన వంతు కృషి చేస్తానని డిపార్ట్మెంట్ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని తెలిపారు.
Prajavartha Online Telugu News