రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
Divyang Cricket Control Board of India ఆధ్వర్యంలో, సమీర్ దివ్య సాహిత్య ట్రస్ట్ నిర్వహణలో ఒడిశా రాష్ట్రంలో ఫిబ్రవరి 21 నుండి 23 వరకు జరిగిన వీల్‌చైర్ క్రికెట్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టు ద్వితీయ స్థానం సాధించింది. ఈ జట్టులో మొత్తం 8 మంది క్రీడాకారులు తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు కావడం విశేషం.
ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి క్రీడాకారులను అభినందించారు. దివ్యాంగ క్రీడాకారులు ప్రతిభతో రాష్ట్రానికి కీర్తి తీసుకువచ్చారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా పరిపాలన తరఫున అవసరమైన ప్రోత్సాహం, సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్‌డీఓ) శేషగిరి, యోగా కోచ్ నాగేంద్ర, ఫుట్‌బాల్ కోచ్ నాగరాజు, చెస్ కోచ్ జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News