రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ షెడ్యూల్ జాతుల కమిషన్ (National Commission for Scheduled Castes) చైర్మన్, కేంద్ర కేబినెట్ మంత్రి హోదా కలిగిన కిషోర్ మక్వానా (Kishor Makwana) 07-03-2026 నుండి 08-03-2026 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు రానున్నారనీ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటన సందర్భంగా 07-03-2026న జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సెక్రటరీ గుడే శ్రీనివాస్, డైరెక్టర్; డాక్టర్ జి. సునీల్ కుమార్ బాబు, చైర్మన్ సహాయ సిబ్బంది పి ఎస్ నితీష్ కుమార్, సీహెచ్. నవీన్ కుమార్, వంటి అధికారులు పాల్గొంటారు.
జిల్లాలో షెడ్యూల్ కులాల సంక్షేమం, అమలులో ఉన్న పథకాలు, సమస్యల పరిష్కారం తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. స్థానిక కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో ఫిబ్రవరి 7 వ తేదీ శనివారం ఉదయం 10.30 గంటల నుంచి ఈ సమావేశం ప్రారంభం కానున్నదని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎస్కే జియజుద్దీన్ తెలిపారు
Prajavartha Online Telugu News