-రేపు పుష్కర్ ఘాట్ నుంచి దేవిచౌక్ వరకు ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మహిళా సాధికారత, సంక్షేమం మరియు పిల్లల పరిరక్షణపై అవగాహన పెంపొందించడానికి 20 రోజులపాటు జిల్లా వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లూ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి టి. శ్రీదేవి తెలిపారు. బుధవారం స్థానిక రాజమహేంద్రవరం అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి శ్రీమతి టి. శ్రీదేవి మాట్లాడుతూ, మహిళలకు ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులు, పిల్లల సంరక్షణ, ఆరోగ్యం, సంక్షేమం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అంతేకాక, కొంతమంది వ్యక్తులు మహిళలను వేధించడం, అనుచిత ప్రవర్తన చేయడం జరుగుతున్న అంశాలను గుర్తుచేశారు. గృహహింస చట్టం, పోష్ చట్టం వంటి ప్రభుత్వ చట్టాల గురించి వివరించారు. మహిళలు ఎవరైనా వేధింపులకు గురైనట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 181 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్న నిబంధనను వారికి తెలియజేశారు. అవసరమైతే పోలీస్ శాఖ సహాయం తీసుకొని తగిన చర్యలు తీసుకుంటామని గారంటీ ఇచ్చారు. అలాగే, రాజమహేంద్రవరం మహిళా కళాశాలలో కూడా మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించ నున్నట్లు తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక పుష్కర్ ఘాట్ నుంచి దేవిచౌక్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా బిసి వెల్‌ఫేర్ ఆఫీసర్ శశాంక విచ్చేసి విద్యార్థులందరికి సోషల్ మీడియాలో జాగ్రత్తలు, సైబర్ సెక్యూరిటీ, మరియు మొబైల్, ఇంటర్నెట్ వాడకం గురించి సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిడిపిఓ పద్మ, ఎం.ఈ.ఓ, డి.ఎల్.ఎస్.ఏ. ఎల్ఏడిసి అధికారులు, పిఎల్వీలు, సైబర్ సెల్ మహేష్, ప్రసాద్
వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ మరియు సిబ్బంది జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ ఆఫీసర్
లీగల్ & ప్రొహిబిషన్ ఆఫీసర్, కౌన్సిలర్
ఆశా కార్యకర్తలు, స్వయం సహాయక సంఘ సభ్యులు
అంగన్వాడీ కార్యకర్తలు, వార్డ్ మహిళా సంరక్షణ కార్యకర్తలు, క్రాఫ్ జిల్లా కోఆర్డినేటర్, విద్యార్థులు
ఈ కార్యక్రమాలు మహిళల హక్కులు, బాధ్యతలు, సాధికారత మరియు భవిష్యత్తులో సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయన్నారు.
Prajavartha Online Telugu News