Breaking News

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు, పాటించాలని, పనుల్లో లోపాలు గుర్తిస్తే కాంట్రాక్టర్ తోపాటు పర్యవేక్షణ అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. బుధవారం ఆకులవారితోట, శ్రీనివాసరావుతోట, నల్ల చెరువు, పొన్నూరు రోడ్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత ఆకులవారి తోటలో నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్ పనులను తనిఖీ చేసి, టెండర్, అగ్రిమెంట్ వివరాలను అడిగి తెలుసుకొని, రిజర్వాయర్ అతి కీలకమైనదని, పనుల్లో ఎక్కడా నిర్లక్ష్యం, నాణ్యతా లోపాలు ఉండడానికి వీలు లేదన్నారు. శ్రీనివాసరావు తోట, నల్లచెరువుల్లో సిసి రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించి, పనులు జరిగే సమయంలో ఎమినిటి కార్యదర్శులు అక్కడే ఉండాలన్నారు. సిసి రోడ్ల వెంబడి మొక్కలు నాటడానికి రింగ్స్ ఏర్పాటు చేయాలన్నారు. క్వాలిటీ కంట్రోల్ ఏజన్సీ ప్రతినిధులు కూడా పనులను స్టేజిల వారీగా పరిశీలించి, రిపోర్ట్ సిద్దం చేయాలని, ఎక్కడైనా లోపాలు గుర్తిస్తే తక్షణం తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అభివృద్ధి పనులకు గల ప్రాధాన్యతను ఇప్పటికే కాంట్రాక్టర్లకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తెలిపామని, ఎవరైనా నిర్లక్ష్యంగా పనులు నిర్వహిస్తే వారి ఈఎండి నుండి అపరాధ రుసుంని జిఎంసికి జమ చేయాలని ఎస్ఈని ఆదేశించారు. అనంతరం రెవెన్యూ వసూళ్లపై ఆర్ఓ, ఆర్ఐ, అడ్మిన్ కార్యదర్శులను అడిగి తెలుసుకొని, మార్చి మొదటి వారం కూడా ముగుస్తున్నందునన బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పాత బకాయిలు చెల్లించని వారి ఇళ్లకు ట్యాప్ కనెక్షన్ తొలగించాలన్నారు. నగరంలో మీటర్ ట్యాప్ ల సంఖ్య తక్కువగా ఉందని, తొలుత బకాయిల వసూళ్లు చేయాలని, అనంతరం వార్డ్ ల వారీగా మీటర్ ట్యాప్ ల పై నివేదిక ఇవ్వాలని ఏఈలను ఆదేశించారు. ప్రజారోగ్య అధికారులతో మాట్లాడుతూ నిర్దేశిత పిన్ పాయింట్ ప్రోగ్రాం మేరకు పారిశుధ్య పనులు జరగాలన్నారు. ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం పక్కాగా జరిగేలా చూడాలన్నారు. ప్రతి డివిజన్లో క్లస్టర్ కంపోస్ట్ బిన్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డివిజన్ల వారీగా కార్మికుల హాజరు అసమగ్రంగా ఉంటుందని, డిప్యూటీ కమిషనర్లు పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. అనంతరం పొన్నూరు రోడ్ లోని ఏబీసి సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించి, పెండింగ్ పనులను 2 రోజుల్లో పూర్తీ చేయాలని ఈఈని ఆదేశించారు.
పర్యటనలో డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, ఎస్ఈ వెంకటేశ్వరరావు, ఈఈలు విష్ణు, కళ్యాణరావు(ఇంచార్జి), డిఈఈలు, ఎస్ఎస్ లు, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *