Breaking News

పాత్ హోల్ ఫ్రీ సిటిగా తీర్చిదిద్దడానికి ఇంజినీరింగ్ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరాన్ని 45 రోజుల్లో పాత్ హోల్ ఫ్రీ సిటిగా తీర్చిదిద్దడానికి ఇంజినీరింగ్ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. బుధవారం కమిషనర్ చాంబర్ లో అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతులతో ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వార్డ్ సచివాలయాల వారీగా పాత్ హోల్స్ మరమత్తుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. సోమవారం కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన జిఎంసి సమీక్షా సమావేశంలో ప్రజా ప్రతినిధులు చర్చించిన అంశాలపై కార్యాచరణకు నివేదిక సిద్దం చేయాలన్నారు. ప్రధానంగా ఏబీసి సెంటర్ ఏర్పాటు పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణంకు సంబంధించి జిఎంసి నుండి ఉన్న పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ (జిటిఎస్) నిర్మాణ కాంట్రాక్టర్ కు నోటీసులు జారీ చేసి, స్పందించకుంటే టెండర్ రద్దు చేసి, నూతన టెండర్ పిలవాలని ఎస్ఈని ఆదేశించారు. నగరంలో పబ్లిక్ టాయ్ లెట్స్ పరిశుభ్ర నిర్వహణపై ప్రజారోగ్య అధికారులు దృష్టి సారించాలని, సంబందిత ఇన్స్పెక్టర్లకు పర్యవేక్షణ విధులు కేటాయించాలన్నారు. అలాగే డ్రైన్లలో వ్యర్ధాలను తొలగించడానికి గ్రిల్స్ ఏర్పాటుపై పాయింట్స్ ని గుర్తించాలని సిఎంఓహెచ్ ని ఆదేశించారు. పార్క్ ల అభివృద్ధిలో స్థానికులను భాగస్వాములులను చేయాలన్నారు. జిఎంసి పరిధిలో చేపట్టే ప్రాజెక్ట్ ల పై అన్ని విభాగాలు సంయుక్తంగా సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్, వివిధ వేదికల ద్వారా ప్రజల నుండి అందే అర్జీల పరిష్కారంపై డిప్యూటీ కమిషనర్లు ఆడిట్ చేసి నివేదిక ఇవ్వాలని, అవసరమైతే క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లాలన్నారు.
పర్యటనలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, జి.సాంబశివరావు, సిటి ప్లానర్ రాంబాబు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎస్ఈ వెంకటేశ్వరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ ఎలిషా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *