Breaking News

గ్యాంగ్ వర్కర్లతో విస్తృతంగా డీసిల్టింగ్ పనులు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్యాంగ్ వర్కర్లతో విస్తృతంగా డీసిల్టింగ్ పనులను చేస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, భవానిపురం, వన్ టౌన్, పటమట ప్రాంతాలలో విస్తృతంగా డీసిల్టింగ్ పనులు చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరం మొత్తం శరవేగంగా డీసిల్టింగ్ పనులను చేస్తున్నామని, అందులో భాగంగా ప్రతి చిన్న డ్రైన్ నుంచి మేజర్ ఔటఫాల్ డ్రైన్ వరకు పారిశుధ్య, ఇంజనీరింగ్ సిబ్బంది డిసిల్లింగ్ పనులను శరవేగంగా చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగా ప్రతి సచివాలయ పరిధిలోగల డ్రైన్లు అన్నిటిని గ్యాంగ్ వర్కర్లను పెట్టి, కాలువల ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా డీసిల్టింగ్ పనులను చేస్తున్నామని తెలిపారు. మరోవైపు ప్రధాన ఔటఫాల్ డ్రైన్ లలో వాహనాల సహాయంతో వ్యర్ధాలను తొలగిస్తున్నామని అన్నారు. ఒకవైపు డీసిల్టింగ్ పనులను చేయడమే కాకుండా మరోవైపు యాంటీ మలేరియా ఆపరేషన్లో చేస్తున్నామని ప్రతీ కాలువలో మలేరియా మందును వేస్తున్నాం తెలిపారు. ప్రధానంగా దోమలను నివారించడమే కాకుండా వర్షాకాలం దృశ్యం కాలవల ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా అప్రమత్తంగా ఉంటున్నామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *