విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఆకాంక్షిత బ్లాకు కార్యక్రమం (ఏబీపీ)-సంపూర్ణతా అభియాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా నీతి ఆయోగ్ అధికారి రాధికా ములే గురువారం ఇబ్రహీంపట్నం మండలంలో సందర్శించారు.
పర్యటనలో భాగంగా ఆమె మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం, ప్రభుత్వ పాఠశాల, పశుసంవర్ధక శాఖ కార్యాలయం, రైతు సేవా కేంద్రం తదితరాలను సందర్శించి అక్కడ అందుతున్న సేవలు, అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను పరిశీలించారు.
అదే విధంగా గుంటుపల్లి గ్రామంలోని RISE (Rural Incubation Skilling and Entrepreneurship) సెంటర్ ను కూడా సందర్శించి అక్కడ మహిళలకు అందిస్తున్న నైపుణ్య శిక్షణలు, ఉపాధి అవకాశాలు మరియు స్వయం ఉపాధి కార్యక్రమాల గురించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆకాంక్షిత బ్లాకు కార్యక్రమం కింద నిర్దేశించిన ఆరు కీలక పురోగతి సూచికలు (కేపీఐ) పూర్తిస్థాయిలో సాధించేందుకు ఇబ్రహీంపట్నం మండల అధికారులు కృషి చేస్తున్నారని రాధికా ములే గారు అభినందించారు. మండలంలో కార్యక్రమాల అమలు సమర్థవంతంగా జరుగుతోందని ఆమె పేర్కొన్నారు.
గౌరవ కలెక్టర్ డా. లక్ష్మీశ IAS గారి ఆధ్వర్యంలో సంపూర్ణతా అభియాన్ 2.0 కార్యక్రమం జిల్లాలో సమర్థవంతంగా అమలవుతూ మంచి ఫలితాలు సాధిస్తోందని ఆమె తెలిపారు.
అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి, వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాల పురోగతిపై సమీక్ష చేపట్టారు. అలాగే మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) సభ్యులతో పరస్పర చర్చ జరిపి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో MPDO శకుంతల, MRO వై.వెంకటేశ్వర్లు, ఎంఏవో రజని, ఎంఈవో పుష్పలత, ఎంవో పర్హిన్, ఏబీపీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, డిప్యూటీ MPDO మనోజ్, పశుసంవర్ధక శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News