Breaking News

క్రీడా విభాగాలలో “శాప్ లీగ్స్”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ – Sports Authority of Andhra Pradesh (SAAP), విజయవాడ వారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ వారి ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో రెండు క్రీడా విభాగాలలో “శాప్ లీగ్స్” నిర్వహించబడనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి డి.ఎమ్.ఎమ్. శేషగిరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శాప్ లీగ్స్‌లో భాగంగా మార్చి 8వ తేదీన జిల్లా స్థాయి పోటీలు మరియు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

టెన్నిస్ పోటీలు:
స్థలం: ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానం, రాజమహేంద్రవరం విభాగాలు: 40 సంవత్సరాల పైబడిన పురుషులు (సింగిల్స్ & డబుల్స్)
మహిళలు (సింగిల్స్ & మిక్స్డ్ డబుల్స్)

బ్యాడ్మింటన్ పోటీలు:
స్థలం: బొప్పన స్పోర్ట్స్ క్లబ్, హుకుంపేట, ఆదిత్యనగర్, రాజమహేంద్రవరం

విభాగాలు :
* 35 సంవత్సరాల పైబడిన పురుషులు (సింగిల్స్ & డబుల్స్)
మహిళలు (సింగిల్స్ & మిక్స్డ్ డబుల్స్)

* 45 సంవత్సరాల పైబడిన పురుషులు (సింగిల్స్ & డబుల్స్)

జిల్లా స్థాయిలో ఎంపికైన బ్యాడ్మింటన్ క్రీడాకారులు మార్చి 14 మరియు 15 తేదీలలో డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపబడతారు.
అలాగే, టెన్నిస్‌లో ఎంపికైన క్రీడాకారులు మార్చి 22 మరియు 23 తేదీలలో విజయనగరం జిల్లా లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనడం జరుగుతుంది అని తెలియ చేశారు.

ఈ పోటీలలో పాల్గొన దలచిన క్రీడాకారులు తప్పనిసరిగా శాప్ అధికారిక వెబ్‌సైట్‌లో (SAAP League) ఆధార్ కార్డు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన క్రీడాకారులు మాత్రమే జిల్లా స్థాయి పోటీలలో పాల్గొనుటకు అర్హులు.
రిజిస్ట్రేషన్ కోసం దిగువ లింక్: ద్వారా నమోదు అవ్వండి.

https://sports.ap.gov.in/#/home/sl/sl-index⁠�
మరిన్ని వివరాలకు యోగా శిక్షకులు బి.వి.జి. నాగేంద్రన్ 9032934038ను సంప్రదించాలని డి ఎమ్.ఎమ్. శేషగిరి తెలిపారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *