-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
మహా కుంభాభిషేకం కార్యక్రమానికి విజయవాడ నగరపాలక సంస్థ వారి తరఫునుండి ఏర్పాటు చేసే త్రాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణకు పక్క ప్రణాళిక తో సిబ్బంది సర్వం సిద్ధం అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహా కుంభాభిషేకం కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 5 వాటర్ స్టాక్ పాయింట్లతో, 44 వాటర్ పాయింట్లు లలో 12 లక్షల వాటర్ బాటిళ్లు, 44 పాయింట్ లలో 750 పారిశుద్ధ్య కార్మికులతో, 7 ప్రాంతాలలో 100 తాత్కాలిక మరుగుదొడ్లు, 24 గంటలు ప్రతి వాటర్ పాయింట్ లో సెక్రటరీ సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రతినిత్యం భక్తులకు త్రాగునీటిలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా వెంటనే స్టాక్ పాయింట్ల నుండి త్రాగునీరుని తీసుకొచ్చేటట్టు ఏర్పాటు చేసే విధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ సహాయంతో 24 గంటలు మూడు షిఫ్ట్ లో పనిచేసే సచివాలయం సిబ్బందిని ఏర్పాటు చేశామని అన్నారు. శుక్రవారం, శనివారం, ఆదివారం జరిగే మహా కుంభాభిషేకం కార్యక్రమంలో ఉదయం 6 గంటల నుండి విధులు నిర్వహించేందుకు గురువారం సాయంత్రం సిబ్బందికి ఏ ప్రాంతంలో డ్యూటీ వేశారో, ఆ ప్రాంతాన్ని చూసుకొని రేపొద్దున ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంటనే వీధిలోకి హాజరు కావాలని, అధికారులు మరి సిబ్బందిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు చూసుకోవాలని ఆదేశించారు.
Prajavartha Online Telugu News