Breaking News

మీడియా డివైస్ డిస్ప్లే ఫీజులు నూరు శాతం చెల్లించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మీడియా డివైస్ డిస్ప్లే ఫీజులు నూరు శాతం చెల్లించాలని, చెల్లించని బోర్డ్ లను తొలగింపుకు యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టం చేశారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో పట్టణ ప్రణాళిక అధికారులు, ప్లానింగ్ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా డివైస్ డిస్ల్పే ఫీజులు బకాయిలు రూ.7 కోట్లకు పైగా ఉండడంపై ఆగ్రహం కమిషనర్ వ్యక్తం చేసి, మాట్లాడుతూ నూరు శాతం ఫీజులు చెల్లించని బోర్డ్ ల తొలగింపు చేపట్టాలన్నారు. అనధికార బోర్డ్ ల పై ఫిర్యాదులు అందుతున్నాయని, వార్డ్ ల వారీగా వాటిని తొలగించడానికి ప్లానింగ్ కార్యదర్శులు భాధ్యత తీసుకోవాలన్నారు. జిఎంసి నుండి నిర్దేశిత ప్లాన్ తీసుకోకుండా నిర్మాణాలు జరగడానికి వీలు లేదని, కొన్ని ప్రాంతాల్లో ప్లాన్ కి భిన్నంగా నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్లాన్ లేకుండా లేదా ప్లాన్ కి భిన్నంగా నిర్మాణాలు జరిగితే ప్లానింగ్ కార్యదర్శి, టిపిబిఓ, టిపిఎస్ లే భాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎక్కడైనా ప్లాన్ డీమ్డ్ గా ఆమోదం పొందితే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఎల్ఆర్ఎస్ కి సంబంధించిన ఫైల్స్ ని 10 రోజుల్లో, కొత్తగా అందిన అప్లికేషన్లను 15 రోజుల్లో పరిష్కారం చేయాలన్నారు. వీటికి సంబంధించిన ప్రతి అంశం ఆన్ లైన్ ద్వారానే చేయాలని, ఎక్కడైనా ఫిర్యాదులు అందితే చర్యలు తీసుకుంటామన్నారు. ఏ స్థాయిలోనూ ఫైల్ 2 పని దినాలకు మించి ఉండకూడదన్నారు. అనధికార లే అవుట్స్ ని ఇన్ ప్రిన్సపుల్ లే అవుట్ ప్యాట్రన్ కి సుమోటోగా చేయాలన్నారు. అలాగే రోడ్ల ఆక్రమణలపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిని నామమాత్రంగా తొలగిస్తున్నారని, మెయిన్ రోడ్లపై ఆక్రమణల తొలగింపుకు టిపిఎస్ ఆధ్వర్యంలో బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. వీధి వ్యాపారుల కోసం వెండింగ్ జోన్ల ఏర్పాటుకు ప్రాంతాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని, జోన్ల ఏర్పాటుపై డిసిపీ నోడల్ అధికారిగా భాధ్యతలు తీసుకోవాలన్నారు. రోడ్లపై, స్తంభాలకు ఏర్పాటు చేస్తున్న అనధికార బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించి, సదరు భాధ్యులకు అపరాధ రుసుం విధించాలని ఆదేశించారు. రోడ్ విస్తరణ జరుగుతున్న ప్రాంతాల్లో ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సమావేశంలో సిటి ప్లానర్ రాంబాబు, డిసిపి సూరజ్ కుమార్, ఏసిపి రెహ్మాన్, టిపిఎస్ లు, టిపిబిఓలు, ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *