-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగులతోనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని, వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ,చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్, డైరీని మంత్రి సవిత గురువారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వ పథకాల అర్హులకు చేరవేయడంలో ఉద్యోగులదే ప్రధాన పాత్ర అని అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులను వేధిస్తే, కూటమి ప్రభుత్వం వారిని అక్కున చేర్చుకుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జీతాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. తమ ప్రభుత్వం రాగానే ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందన్నారు. అనంతరం బీసీ ఎలక్ట్రిసిటీ ఉద్యోగ సంఘ నేతలు మంత్రి సవితను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వి.అనురాధ, వి.గుణవంతుడు, సురేశ్, సతీష్ సహా పలువురు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News