అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అనంతపురం పార్లమెంట్ పరిధిలోని తాడిపత్రి మరియు సింగనమల నియోజకవర్గాలలో నిర్వహించిన జనసేన పార్టీ “ఉద్యమి” సభ్యత్వ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, అనంతపురం పార్లమెంట్ జనసేన ఉద్యమి సమన్వయకర్త డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ విచ్చేసి పాల్గొన్నారు.
మొదటగా తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక్కం మధుసూదన్ రెడ్డి , తాడిపత్రి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జీ కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగేంద్ర , జిల్లా కార్యదర్శులు సంజీవ రాయుడు, సారంగా మారేష్ , తాడిపత్రి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అబ్దుల్ రహీం , తాడిపత్రి పట్టణ అధ్యక్షులు కుందుర్తి నరసింహ చారి , తాడిపత్రి మండల అధ్యక్షులు కుంకుమ కిరణ్ కుమార్ , యాడికి మండల అధ్యక్షులు కోడి సునీల్ కుమార్, పెద్దపప్పూరు మండల అధ్యక్షులు భయపరెడ్డి, పెద్దవడుగూరు మండల అధ్యక్షులు దూద్ వలి తదితర నాయకులు పాల్గొన్నారు.
అనంతరం సింగనమల నియోజకవర్గం నార్పల మండలంలో నిర్వహించిన జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమంలో సింగనమల నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జీ సాకే మురళి కృష్ణ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అంకె ఈశ్వర్, జిల్లా కార్యదర్శి చొప్ప చంద్రశేఖర్ , జిల్లా సంయుక్త కార్యదర్శులు బి పురుషోత్తం రెడ్డి, డి కృష్ణమూర్తి , నార్పల మండల కన్వీనర్ జి రామకృష్ణ , సింగనమల మండల అధ్యక్షులు తోట ఓబులేసు , బుక్కరాయసముద్రం మండల అధ్యక్షులు జి ఎర్రిస్వామి, గార్లదిన్నె మండల అధ్యక్షులు ఎం రాఘవేంద్ర, పుట్లూరు మండల అధ్యక్షులు ఎంఆర్ రవికుమార్, ఎల్లనూరు మండల అధ్యక్షులు ఎం ఆదినారాయణ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఎం భాస్కర్, ఎస్ మునీంద్ర తదితర నాయకులు పాల్గొన్నారు.
అలాగే సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం కేకే అగ్రహారం గ్రామానికి చెందిన మాజీ వైసీపీ నాయకులు జే బాలకృష్ణ (మాజీ ఉపసర్పంచ్), సాకే పుల్లన్న, అసేన్ భాష, సాకే నాగర్జున, సాకే బాలరాజు, సాకే శివయ్య, సాకే పెద్దన్న, కే ఓబులేసు, బి జయచంద్ర, కే హనుమంతు తదితరులు బుక్కరాయసముద్రం మండలం జనసేన కన్వీనర్ జి ఎర్రిస్వామి అధ్యక్షతన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, జనసేన పార్టీ స్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లడం ప్రతి జనసైనికుడి బాధ్యత అని అన్నారు. “జనసేన ఉద్యమి సభ్యత్వం కేవలం ఒక సభ్యత్వం మాత్రమే కాదు… అది కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దే ఉద్యమం” అని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై పోరాడే యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడంలో ప్రతి కార్యకర్త ముందుండాలని సూచించారు. ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరడం పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమాలలో అనంతపురం జిల్లా సీనియర్ నాయకులు కూరగాయల లక్ష్మీపతి, అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి సంజీవ రాయుడు, రాయదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మంజునాథ్ గౌడ్, రాప్తాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ సాకే పవన్ తదితర నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమాలను విజయవంతం చేశారు.
Prajavartha Online Telugu News