-ట్రై సైకిల్స్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలకు మరింత ఉపయోగ పడేలా చల్లంరాజు వెంకట శేషయ్య ధర్మ సత్రం ను అభివృద్ధి చేస్తామని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు.. సత్రం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా పాల్గొన్నారు.. మహిళలకు కుట్టు మెషీన్లు, వికలాంగులకు ట్రై సైకిళ్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అంద చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోజుల్లోనే దీర్ఘ ఆలోచన చేసి దాతలు ఈ సత్రం ను ఇవ్వడం ముదావహమన్నారు.. సమాజానికి ఉపయోగపడే పనులు చేసే ఇలాటి పుణ్య మూర్తులను మనం స్మరించుకోవాలన్నారు.. దాతల ఆశయం మేరకు మహిళలకు వివిధ కార్యక్రమాలకు ఉపయోగపడేలా ఈ సత్రం ను అభివృద్ధి చేయువచున్నారు. ఈ సత్రం పేరున ఉన్న సొమ్ము తో పాటు ప్రభుత్వ పరంగా కూడా సహకారం అందేలా చూసి మరింత విస్తృత పరిచేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే సుజనా చౌదరి హామీ ఇచ్చారు.. కార్యక్రమంలో నూర్ భాష కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా , కార్పొరేటర్లు ఉమ్మడి చంటి, రాజేష్, టీడీపీ నాయకులు అబ్దుల్ ఖాదర్, టీడీపీ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, సత్రం చైర్మన్ శివ తదితరులు పాల్గొన్నారు..
Prajavartha Online Telugu News