Breaking News

నార్త్ అమెరికా స్పెషల్ రిప్రజేంటేటివ్ గా బాధ్యతలు స్వీకరించిన కోమటి జయరాం

-హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎన్నారైలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కోమటి జయరాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున నార్త్ అమెరికా స్పెషల్ రిప్రజేంటేటివ్ గా.. ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లి ఏపీఎన్నార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నేడు వివిధ దేశాలకు చెందిన ఎన్నారైల సమక్షంలో, వేద ఆశీర్వచనాల నడుమ నేడు ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి అయింది. ఈ కార్యక్రమలో ఎన్నారై శాఖా మాత్యులు కొండపల్లి శ్రీనివాస్, ఏపీ ఎన్నార్టీ అధ్యక్షులు వేమూరి రవి, సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్ రవి మండలపు, ప్రముఖ ఎన్నారై డాక్టర్ రాజా పిల్లి సహా తదితర ఎన్నారైలు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఆయన సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని, ఇదే సమయంలో అమెరికాలో చదువుకుంటున్న విద్యార్ధులు, అక్కడ పని చేస్తున్న ఉద్యోగులకు ఏవైనా సమస్యలు వారి పరిష్కారాలకు కృషి చేయడమే కాకుండా, రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించే విషయంలో, తన వంతు కృషి చేయడంలో సమర్ధవంతంగా పని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *