అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర శాసనసభను ఈ రోజు 19 పాఠశాలలకు చెందిన మొత్తం 573 మంది విద్యార్థులు సందర్శించారు. ఇప్పటివరకు 154 పాఠశాలలకు చెందిన 5,615 మంది విద్యార్థులు అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు. చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య విలువలు మరియు చట్టాల రూపకల్పనపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సభా కార్యక్రమాలపై విద్యార్థులు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి తెలుసుకున్నారు. సభ విరామ సమయంలో హోం మంత్రి అనిత విద్యార్థులతో ముచ్చటించారు. చిన్నారులతో స్నేహపూర్వకంగా మాట్లాడిన మంత్రి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థుల కళ్లలో కనిపించిన కుతూహలం, దేశం పట్ల వారికి ఉన్న బాధ్యతాయుతమైన ఆలోచనలు ఎంతో ఆనందాన్ని కలిగించాయని మంత్రి అనిత తెలిపారు. భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదిగి దేశాభివృద్ధికి తోడ్పడాలని విద్యార్థులకు ఆమె సూచించారు.
Prajavartha Online Telugu News