Breaking News

మహిళా రక్షణ పోస్టర్లను ఆవిష్కరించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్

-మహిళా రక్షణ చట్టాలపై మరింత అవగాహన పెంచాలి
-స్వచ్ఛంద సంస్థలు చట్టాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియజేయాలి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దళిత బహుజన రిసోర్స్ సెంటర్ వారు మహిళల రక్షణ చట్టాల పైన రూపొందించిన పోస్టర్లను గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వారి కార్యాలయంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఆవిష్కరించారు. పోస్టర్ల విడుదల అనంతరం శైలజ మాట్లాడుతూ…. మహిళల రక్షణ చట్టాలపై ప్రజల్లో మరింత అవగాహన రావాలని అన్యాయానికి గురైన మహిళలు వెంటనే ఫిర్యాదులు చేసే విధంగా చట్టాలను తెలియచెప్పాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు సేవతోపాటు చట్టాలను గ్రామీణ ప్రాంత నిరక్షరాస్యులకు వివరించి చైతన్య పరచాలన్నారు. మహిళా భద్రత సంరక్షణ ఏ ఒక్కరి బాధ్యత కాదని అది మనందరి సమిష్టి బాధ్యతన్నారు. బాల్యవివాహాలు, టీనేజీ గర్భాల వలన జరిగే అనర్థాలను పోస్టర్లు, వీడియోలు, ఇతర ఇతర దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రజలలోకి విస్తృతంగా తీసుకుపోవాలన్నారు. మహిళల రక్షణ, సంరక్షణకు సేవ చేయాలనుకునే స్వచ్ఛంద సేవా సంస్థలకు మహిళా కమిషన్ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *