మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెనమలూరు మండలం కానూరులోని తోటకూర వెంకట విజయ కుమార్ నివాసంలో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులు తోటకూర గోపీచంద్, మాళవికలను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం పుష్పగుచ్చం అందచేసి వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ ఐ జి అశోక్ కుమార్, నేతృత్వంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ వీ విద్యాసాగర్ నాయుడు, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, అదనపు ఎస్పీ సత్యనారాయణ, పెనమలూరు, కైకలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, కామినేని శ్రీనివాస్ , డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్, ఉయ్యూరు ఇంచార్జ్ ఆర్డిఓ శ్రీదేవి, ఆర్డిఓ ఎన్యుఎన్ ఎస్ శ్రీనివాస్ రావు, డిఎస్పి శ్రీనివాసరావు, ఆహార తనిఖీ అధికారి గోపాలకృష్ణ తహసిల్దారు శివకుమార్ రాజు తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News