Breaking News

రోడ్లపై చెత్త వేస్తే జరిమానా

-నిబంధనలు ఉల్లంఘిస్తే మొబైల్ కోర్టులో హాజరు కావాల్సిందే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలతో రోడ్ల పైన చెత్త వేసిన వారికి, కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ప్రతి శుక్రవారం నిర్వహించే మొబైల్ కోర్టులో 8వ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ గోలీ లెనిన్ బాబు, శుక్రవారం ఉదయం సర్కిల్-2 కార్యాలయం, నందు సర్కిల్-2 పరిధిలోని శానిటరీ ఇన్స్పెక్టర్లు నమోదు చేసిన 17 కేసులపై విచారణ జరిపి వారికి Rs. 8,410/- రూపాయలు జరిమానా విధించారు.మరోసారి మరోసారి ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా చేస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు. ఈ సందర్భంగా రోడ్లపై మాట్లాడుతూ చెత్త వేసిన మురుగు ప్రవాహానికి అడ్డుపెట్టిన, రోడ్డుపైన పెంపుడు జంతువుల్ని ఉంచినా, లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై మొబైల్ కోర్ట్ చర్యలు తీసుకుంటుందని నగర ప్రజలని మొబైల్ కోర్ట్ జడ్జి హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ప్రభుదాస్, ఏ ఎం ఓ హెచ్ డాక్టర్ అన్నపూర్ణ, శానిటరీ సూపర్వైజర్స్ సలీం మహమ్మద్, శానిటరీ ఇన్స్పెక్టర్లు సురేంద్రనాథ్, జైపాల్,యేసు రత్నం, పి. హేమంత్ కుమార్,మేరుగా రాజేష్, బుజ్జి బాబు మరియు గోపిరాజు కార్యక్రమంలో పాల్గొనినారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *