Breaking News

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నైపుణ్యాభివృద్ధి వర్క్ షాప్ లు సక్రమంగా నిర్వహించాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఆర్ఎఎంపీ ద్వారా నైపుణ్యాభివృద్ధి వర్క్ షాప్ లు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలక్టరేట్ లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధ్యక్షతన  జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతులు ప్రోత్సాహక  కమిటీ( డీఐఈపీసీ) సమావేశం జరిగింది. సమావేశం అజెండా అంశాలపై జిల్లా కలెక్టర్  ఏ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ ఆర్ఎఎంపీ ద్వారా  వెండర్ డెవలప్మెంట్, ఉద్యమ్, ఈఎస్డీపీ తదితర వర్క్ షాప్ లు ఎంఎస్ఎంఈలు, అమ్మకదారులకు , తయారీదారులు వ్యాపార నెపుణ్యాలపై  శిక్షణ ఏజెన్సీలు సక్రమంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుంటూ పరిశ్రమలు శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు సింగల్ విండో ద్వారా అందించిన దరఖాస్తులను  విత్ ఇన్ ఎస్ ఎల్ ఏ లోనే అనుమతులు మంజూరు చేయాలన్నారు. పీఎంఈజీపి, ముద్రా , పీఎంఎఫ్ఎంఈ, స్టార్టప్ ఇండియా, మైక్రో , స్మాల్, మీడియం ఎంటర్ ప్రైజస్ కి  నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేసి నూరుశాతం గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా పరిధిలో క్యాబినెట్ ఆమోదించింది ఎంవోయూ పరిశ్రమలు ఏర్పాటు కు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో వివిధ పరిశ్రమల రాయితీలకు సంబంధించి 15 క్లైయిమ్స్ కు రూ.3,39,06,843/-మంజూరు చేస్తూ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆమోదించారు.

ఈ సమావేశంలో  పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఏ జయలక్ష్మి, , ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎంఎల్ఎన్ రావు, డిపిఓ సాయికుమార్, జిల్లా ఉపాధి అధికారి దుర్గా బాయి, లీడ్ బ్యాంకు మేనేజర్ మహిపాల్ రెడ్డి, డీఆర్డీఎ పిడీ విజయలక్ష్మి, సోషల్ వెల్ఫేర్ డిడి చెన్నయ్య, ఉద్యాన శాఖ అధికారి రవీంద్ర బాబు. డిసిఎల్ఏ. గాయత్రి దేవి ,జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి సంజీవరావు,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పద్మావతి, సీపీడిసీఎల్, ఆర్టీఓ శ్రీహరి,  సిక్కి ఆర్ఎం పరిమళ, డీఐసీసీఐ జిల్లా కో ఆర్డినేటర్ కె పావని తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *