గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే శనివారం సాయంత్రం నాటికి నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పై మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పెండింగ్ ఉన్న వార్డులలో, గ్రామాలలో వెంటనే పూర్తి చేసేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు వార్డు, గ్రామ స్వర్ణ కార్యాలయాల ఉద్యోగులతో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అదేవిధంగా పి4 కి సంబంధించి బంగారు కుటుంబాలకు అవసరమైన సహాయాల వివరాలను తెలుసుకొని ఆన్లైన్ అప్లోడ్ చేయాలన్నారు. మార్గదర్శకులతోను మాట్లాడి వారు దత్తత తీసుకున్న కుటుంబాల వివరాలను తెలియజేయాలని సూచించారు.
Prajavartha Online Telugu News