Breaking News

నేటి సమాజాభివృద్ధికి నాణ్యమైన మానవ వనరులే కీలకం : మాజీ డిజిపి మాలకొండయ్య

-వచ్చే ఏడాది అతిపెద్ద సమ్మేళనం: రెక్టార్ వెల్లడి
-సమ్మేళనంతో వర్సిటీ-పరిశ్రమల మధ్య సత్సంబంధం: సీఈవో ఆండ్రియో గేర్రా
-రెండో రోజు 20 అవగాహన ఒప్పందాలు
-ఆకట్టుకున్న డ్రోన్ షో
-కొనసాగిన సాంకేతిక ఉపన్యాసాలు
-ఏఎన్యూలో నేటితో ముగియనున్న విద్య-పరిశ్రమల సమ్మేళనం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి సమాజాభివృద్ధికి నాణ్యమైన మానవ వనరులే కీలకమని ఆంధ్రప్రదేశ్ విశ్రాంత మాజీ డిజిపి మాలకొండయ్య వెల్లడించారు.ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈనెల 5న ఏర్పాటు చేసిన విద్య- పరిశ్రమల సమ్మేళనం-2026 కొనసాగింపులో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ డిజిపి మాలకొండయ్య మాట్లాడుతూ నాణ్యమైన మానవ వనరుల ద్వారా దేశాభివృద్ధితో పాటు వ్యక్తిగత అభివృద్ధి జరుగుతుందన్నారు.విద్యాసంస్థలు,పరిశ్రమల మధ్య సత్సంబంధాలు కొనసాగినప్పుడే ఉపాధి పరంగా విద్యార్థుల అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించటానికి విద్యార్థులకు ఈ సమ్మేళనం ఎంతో దోహదపడుతుందని ఉద్ఘాటించారు. విద్యార్థులు చదువుతోపాటు నైపుణ్య జ్ఞానాన్ని పెంచుకోవాలని ఆయన సూచించారు. భారత్ లో అధిక శాతం మంది అసంఘటిత రంగాల్లో ఉన్నారని, వారంతా సంఘటిత రంగంలోకి రావాలంటే నాణ్యత ప్రామాణికమని చెప్పారు.అధ్యాపకులు మూస పద్ధతిలో కాకుండా ప్రయోగాత్మక పద్ధతిలో బోధన చేయాలని మాలకొండయ్య పేర్కొన్నారు.సమ్మేళనం సభకు అధ్యక్షత వహించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమ్మేళనం ఎస్టీమ్డ్ పాట్రన్ రెక్టార్ ఆచార్య ఆర్.శివరాంప్రసాద్ మాట్లాడుతూ కేవలం పది రోజుల్లోనే అద్భుతమైన సమ్మేళనం ఏర్పాటు చేస్తామని, వచ్చే ఏడాది 500 కంపెనీలకు తగ్గకుండా అతిపెద్ద సమ్మేళనం ఏర్పాటు చేసి బహుళ జాతి సంస్థలను భాగస్వామ్యం చేస్తామన్నారు.కృత్రిమ మేధ లాంటి సాంకేతికతను అందుకోలేకపోతే జీవనోపాధికి దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల మంది సాఫ్ట్వేర్ లాంటి సాంకేతిక ఉద్యోగాల్లో రాణిస్తున్నారని, సాంకేతిక రంగంలో కూడా విద్యార్థులకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నాయని ఆచార్య శివరాంప్రసాద్ పేర్కొన్నారు.విజయవాడలోని రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామీజీ మాట్లాడుతూ భారత్ వసుదైక కుటుంబం అనే
సైదాంతికతో కొనసాగుతుందన్నారు. విద్యార్థులు తమ దృష్టిని లక్ష్యం దిశగా కేంద్రీకరించినప్పుడే అనుకున్న విజయాలను సాధిస్తారని చెప్పారు.మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత పరిశ్రమల ప్రతినిధి సాంబశివరావు మాట్లాడుతూ నేడు చదువు,సంస్కారం రెండుగా విడిపోయాయని,దీనివల్ల సమాజంలో దుష్ఫలితాలు ఎదురవుతున్నాయన్నారు.విద్యార్థుల చదువు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు.అలాగే విద్యార్థులు పుస్తక పఠనంకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సాంబశివరావు పేర్కొన్నారు.
ఎల్ ఎల్ సి పరిశ్రమల ప్రతినిధి డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తామన్నారు.యూకే లోని ఎన్టీఆర్ బయో సెన్సర్స్ సీఈవో ఆండ్రియో గేర్ర మాట్లాడుతూ సమ్మేళనంతో విశ్వవిద్యాలయం,పరిశ్రమల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయన్నారు. ఇటలీకి చెందిన న్యూరో టెక్ ఫర్ రిహాబిలిటేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్ క్లాడియో గబ్బియని, ఏఎన్యూ రిజిస్టార్ ఆచార్య సింహాచలం, సంకేత్ ఫౌండేషన్ చైర్మన్ సాత్విక్, ఐసిఎఫ్ఏసి ప్రతినిధి రాకేష్ కుమార్ తదితరులు ప్రసంగించారు.అనంతరం రెక్టార్ ఆచార్య శివరాంప్రసాద్ అతిధులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సమ్మేళనం కన్వీనర్ ఆచార్య పి.పద్మావతి,సంచాలకులు ఆచార్య లింగరాజు,ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సురేష్ కుమార్,అడ్వైజరీ కమిటీ సభ్యులు,సోషల్ సైన్స్ డీన్,దూరవిద్య సంచాలకులు ఆచార్య వి.వెంకటేశ్వర్లు, అవగాహన ఒప్పందాల కమిటీ సభ్యులు,
సిడిసి డీన్ ఆచార్య వి.రవికుమార్ తో పాటు అధ్యాపకులు,పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వర్సిటీ- పరిశ్రమల మధ్య 20 అవగాహన ఒప్పందాలు:సమ్మేళనంలో భాగంగా శుక్రవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, వివిధ పరిశ్రమల ప్రతినిధుల మధ్య అవగాహన ఒప్పందాలు జరిగాయని రెక్టార్ ఆచార్య శివరాం ప్రసాద్, సమ్మేళనం కన్వీనర్ ఆచార్య పద్మావతి తెలిపారు.ప్రతిష్టాత్మక సంస్థలైన ఫినిక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ డైరెక్టర్ చుక్కపల్లి రాకేష్, దుబాయ్ కు చెందిన ఎల్ ఎల్ సి కంపెనీ ప్రతినిధి డాక్టర్ రవికుమార్,సంకేతా ఫౌండేషన్ చైర్మన్ సాత్విక్, స్పేస్ ఐఎన్ఎఫ్ కంపెనీ ప్రతినిధులు డాక్టర్ మధుచంద్ర,డాక్టర్ శ్రీదేవి,రిజ్విన్ బయో మెడికల్,ఐటీ , ఎన్టీఆర్ బయో సెన్సార్స్ తో పాటు ఆయా పరిశ్రమల ప్రతినిధులు,ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెక్టార్ ఆచార్య శివరాంప్రసాద్,కన్వీనర్ ఆచార్య పద్మావతి,రిజిస్టార్ ఆచార్య సింహాచలంలు
20 అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు.

ఆకట్టుకున్న డ్రోన్ ప్రదర్శన:సమ్మేళనంలో భాగంగా శుక్రవారం విశ్వవిద్యాలయం క్రీడా ప్రాంగణంలో ఇండియా డ్రోన్ అకాడమీ నిర్వహించిన డ్రోన్ ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది.విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గంగాధరరావు,రెక్టార్ ఆచార్య శివరాంప్రసాద్, రిజిస్టార్ ఆచార్య సింహాచలం తో పాటు విద్యార్థులు డ్రోన్ ప్రదర్శనను తిలకించారు.డ్రోన్ ప్రదర్శన పట్ల అధికారులు, విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపారు.అలాగే సమ్మేళనంలో భాగంగా శుక్రవారం కొత్తగా మరికొన్ని పరిశ్రమల ప్రతినిధులు వారి ఉత్పత్తులతో కూడిన స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.దీంతో విశ్వవిద్యాలయం నిర్దేశించిన స్టాల్స్ 50 కు చేరాయి.యూకే కు చెందిన లియో గ్లోబల్ ఓవర్సీస్ సంస్థ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లే విధానంపై అవగాహన కల్పించే స్టాల్స్ ను ఏర్పాటు చేయగా, మంగళగిరి కి చెందిన మాన్విక హ్యాండీక్రాప్స్ అండ్ స్పోర్ట్స్ మెమొంటోస్ స్టాల్స్ లో అద్భుతంగా ఆకట్టుకునే వస్తువులను ఏర్పాటు చేసింది.
ఏహెచ్ కెరీర్ అకాడమీ,పయనీర్,రైల్ టెల్, రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ, ఓంకార్స్,హ్యూబిట్స్,జిఎం సోలార్ సిస్టమ్స్, ఐఆర్ సిటిసి టూరిజం,కిమ్స్ శిఖర హాస్పిటల్స్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ నివారణ విభాగం,కిసాన్ పరివార్,ఎస్ ఎం హాలిడే ప్లానర్స్,స్పేస్ టెక్నాలజీ,డ్రోన్ టెక్నాలజీ లాంటి పలు సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్ విద్యార్థులను ఎంతో ఆకట్టుకున్నాయి.విద్యార్థులు ఆయా స్టాల్స్ ను సందర్శించి పరిశ్రమల్లో ఉద్యోగాల సాధనకు అవసరమైన నైపుణ్యాలపై అవగాహన తెచ్చుకున్నారు.రెక్టార్ ఆచార్య శివరాం ప్రసాద్,రిజిస్టార్ ఆచార్య సింహాచలం లు స్టాల్స్ ను సందర్శించారు.అలాగే ఆయా పరిశ్రమల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సాంకేతిక ప్రత్యేక ఉపన్యాసాలు ఎంతో ఆకట్టుకున్నాయి.ఈ సమ్మేళనం శనివారంతో ముగియనుంది.రెండు రోజుల నుంచి సమ్మేళనం విజయవంతంగా కొనసాగుతుందని రెక్టర్ ఆచార్యశివరాం ప్రసాద్,రిజిస్టార్ ఆచార్య సింహాచలం తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *