గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జన్ సున్ వాయ్ (పబ్లిక్ హియరింగ్) కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పూర్వ గుంటూరు జిల్లా పరిధికి సంబంధించి దీనిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జన్ సున్ వాయ్ ను 10వ తేదీ ఉదయం 10 గంటల నుండి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ అధ్యక్షతన కార్యక్రమం జరుగుతుందని, ప్రజల నుండి వినతులు, పెండింగ్ అంశాలను స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
Tags guntur
Check Also
నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”
-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …
Prajavartha Online Telugu News