Breaking News

ఎస్డీజీ కేపీఐ లక్ష్యాలు నూరు శాతం సాధించాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు స్వర్ణాంధ్ర  సుస్థిర అభివృద్ధికి నిర్దేశించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండీకేషన్ ( కేపీఐ) లక్ష్యాలు నూరుశాతం అధిగమించేలా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా స్వర్ణాంధ్ర  సుస్థిర అభివృద్ధి కీ పెర్ఫార్మెన్స్ ఇండీకేషన్ లక్ష్యాల పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికలకు సంబంధించి కీ పెర్ఫార్మెన్స్ ఇండీకేషన్ మ్యాపింగ్ సక్రమంగా చేయాలన్నారు, నూరుశాతం పెర్ఫార్మెన్స్ సాధించడానికి గల కారణాలు, తక్కువ పెర్ఫార్మెన్స్ రావటానికి గల కారణాలను అన్ని శాఖలు పూర్తిస్థాయిలో నివేదిక అందించాలన్నారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ జరగనున్న నేపథ్యంలో శాఖల వారీగా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఆర్థిక, ఆర్థికేతర అంశాలు, క్షేత్రస్థాయిలోని సమస్యలను రాష్ట్రస్థాయిలో పాలసీ పరంగా తీసుకోవాల్సిన చర్యల వివరాలను అందించాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో వి జ్యోతి బసు, సీపీఓ శేషశ్రీ, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కోమలి పద్మ,,డీటీసీ సితారామిరెడ్డి, డీపీఓ సాయి కుమార్, మార్కెటింగ్ ఏడి సత్యనారాయణ చౌదరి , హౌసింగ్ పీడీ ప్రసాదు, ఆర్టీసీ ఆర్ఎం జె సాంబ్రాజ్యం, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవీందర్, ఎపీఎంఐపీ పీడీ వజ్రశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *