-సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు సత్కార కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనాచౌదరి పిలుపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ ఎమ్మల్యే సుజనా చౌదరి వివిధ రంగాలకు చెందిన మహిళలను ఘనంగా సత్కరించారు. మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా భవానీ ఐలాండ్ లో సుజనా ఫౌండేషన్ మహిళల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ .. ప్రజాస్వామ్య స్పూర్తి లో మినీ ఇండియా గా పేరొందిన పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశానని తెలిపారు. ఎన్నికల ప్రచారంలోనే పశ్చిమ నియోజకవర్గం లోని కొండ ప్రాంతాలతో సహా అన్ని ప్రాంతాలలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నానన్నారు. పశ్చిమ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి చాలా కార్యక్రమాలు చేపట్టానన్నారు. తనకున్న సమయాన్ని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రజలకు సేవలు అందిస్తున్నానని తెలిపారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. విద్యా, వైద్య రంగాలలో ప్రభుత్వం తో పాటు సుజనా ఫౌండేషన్, తో పాటు వివిధ సంస్థల సహకారంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను అన్నారు. మహిళలు 50 శాతం మంది రాజకీయాల్లోకి రావాలని, అపుడే మహిళా శక్తి దేశానికి వినియోగించ వచ్చని సూచించారు. మహిళలు రిజర్వేషన్ల మీద ఆధారపడకుండా ప్రతిఒక్కరు తమ శక్తి సామర్థ్యాల ద్వారా అన్ని రంగాలలో పురోగతి సాధించాలని పిలుపునిచ్చారు. రూరల్, తో పాటు అర్బన్ మహిళలకు , డ్వాక్రా మహిళలకు సరైన మార్గదర్శకం లేనందునా వారికి వివిధ వ్రుత్తులలో సుజనా ఫౌండేషన్ ద్వారా శిక్షణలు ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో దూసుకు వస్తున్నా ఏ ఐ కి పోటీగా విలేజ్ ఇంటెలిజెన్స్ వీ ఐ ను అలవర్చుకుని సాధికారత సాధించాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ మహిళా దినోత్సవ వారోత్సవాల లో ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారని కొనియాడారు. సమాజంలో మహిళా శక్తి లేనిదే ప్రగతి లేదు అని భావించి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు. సృష్టికి మూలం మహిళా కాబట్టి అవకాశాలు కూడా మహిళలకు సమానంగా వస్తున్నాయన్నారు. మహిళలు పారిశ్రామికంగా ఎదిగితే జాతీయ స్థాయిలో పారిశ్రామిక వృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే ఆకాంక్ష తో ఎమ్మెల్యే సుజనా చౌదరి పని చేస్తున్నారన్నారు. ఆయనకు ఎమ్మెల్యే పదవి కంటే 47 వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో గెలిపించిన ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నపుంచి కొండ ప్రాంత ప్రజల కష్టాలకు చెక్ పెట్టేందుకు వివిధ చర్యలు చేపట్టారని తెలిపారు. నాయకులకు కొంత మందికి మనీ ఉంటుంది కానీ మనసు ఉండదు. కానీ సుజనా గారికి మనీ, మనసు రెండూ ఉన్నందున పశ్చిమ నియోజకవర్గాన్ని రాష్ట్ర్లంలోనే నంబర్ 1 స్థానంలో నిలబెట్టారని కొనియాడారు. దుర్గ గుడి అభివృద్ధి తో పాటు పాత బస్తీ అభివృద్ధికి సైతం ఆయన మార్కుతో పని చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెస్ట్ ను బెస్ట్ చేస్తానని చెప్పి అందుకు అనుగుణంగానే నంబర్ 1 గా నిలబెట్టారని తెలిపారు.
కార్యక్రమంలో పోలీసు శాఖ, కార్పొరేషన్, ఆటో డ్రైవర్లు, జర్నలిస్టులతో పాటు వివిధ విభాగాలకు చెందిన మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి, కలెక్టర్ లు మహిళలను సత్కరించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ అధికారిణి సుహాసిని, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News