Breaking News

దివ్యాంగులకు ప్రభుత్వం చేయూత : ఎంపి కేశినేని శివనాథ్

విస్సన్నపేట, నేటి పత్రిక ప్రజావార్త :
దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూత అందిస్తుందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. విస్సన్నపేట మండల టిడిపి కార్యాలయం వద్ద విస్సన్నపేటకు చెందిన షేక్ మస్తాన్, కుక్కల జోజిబాబు అనే ఇద్దరు దివ్యాంగులకు తన సొంత నిధులతో ట్రై సైకిళ్లను టిడిపి నాయకులతో కలసి ఎంపీ శివనాథ్ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ….దివ్యాంగులకు మనోధైర్యంను పెంచేలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అర్హులైన దివ్యాంగులకు అందరికీ ప్రతి నెలా సామాజిక పింఛను అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఎవరైనా అర్హులకు పింఛన్లు అందక పోతే అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఈ కార్య‌క్ర‌మంలో విస్స‌న్న పేట మండ‌ల పార్టీ అధ్యక్షుడు రాయ‌ల సుబ్బారావు, విస్సన్నపేట ప‌ట్ట‌ణ‌ అధ్యక్షులు కొంగల‌ శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా తెలుగురైతు అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు , జిల్లా సీనియ‌ర్ నాయకులు తాళ్లూరి రామారావు , ఎన్టీఆర్ జిల్లా టిడిపి మాజీ ఉపాధ్య‌క్షుడు నెక్క‌ల‌పు శ్రీను (డాబా శ్రీను), ఎన్.ఆర్.ఐ నాయ‌కులు వ‌ల్ల‌భ‌నేని గిరి, మారెమ్మ‌ ఆలయ టస్ట్రు బోర్డు ఛైర్మన్ తేర్ల శ్రీనివాసరావు , ఎన్టీఆర్ జిల్లా టిడిపి కోశాధికారి నాదెళ్ల నాగమణి, రాష్ట్ర లీగ‌ల్ సెల్ కార్య‌ద‌ర్శి కొత్త‌ప‌ల్లి ఆనంద్ స్వరూప్, గ్రామ పార్టీ అధ్యక్షులు అరిగే శ్రీనివాసరావు, గంప‌ల గూడెం మండ‌లం పార్టీ అధ్య‌క్షుడు మానికొండ రామ‌కృష్ణ (ఎమ్.ఆర్.కె) తిరువూరు ప‌ట్ట‌ణ పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లెల శ్రీనివాసరావు , తెలుగుయువత రాష్ట్ర నాయకులు కవులూరి రాజా , జిల్లా నాయ‌కులు ఆకుల రాధాకృష్ణ, తిరువూరు వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీ ఉపాధ్యక్షులు కుక్క‌డ‌పు నాగేశ్వ‌ర‌రావు. సోసైటీ అద్య‌క్షుడు కంభంపాటి బద్రినాధ్, మండ‌ల తెలుగు యువ‌త నాయ‌కులు ముత్తం శెట్టి వంశీ, టిడిపి సీనియ‌ర్ నాయ‌కులు ఎన్.టి వెంక‌టేశ్వ‌ర‌రావు, విస్స‌న్న పేట టౌన్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు చిన్నోడు, తెలుగు యువ‌త నాయ‌కులు రాయ‌ల కిట్టు, మాజీ ఎంపిపి ముత్తంశెట్టి వెంక‌టేశ్వ‌ర‌రావు, తెలుగు యువ‌త నాయ‌కులు తుమ్మ‌ల‌ప‌ల్లి అనిల్, తుమ్మ‌ల‌ప‌ల్లి సునీల్ ,, మాజీ ఎంపిపి గ‌ద్దె వెంక‌టేశ్వ‌ర‌రావు, మాజీ ఎంపిటిసి కావూరి బాబు, జెడ్పీటిసీ మాజీ స‌భ్యులు మ‌ట్టా వేణుగోపాల‌రావు, టిడిపి దళిత నాయకులు బొద్దుకోళ్ల ప్రేమరాజ ల‌తో పాటు ఎన్డీయే కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *