వేంసూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కొత్తూరు గ్రామంలో గ్రామ ప్రముఖులైన ఉప్పలపాటి సుబ్బారావు సంస్మరణార్థం ఆయన కుమారులైన ఉప్పలపాటి విజయ్‌కుమార్, భాను కిరణ్, ఉప్పలపాటి బ్రదర్స్ ఆధ్వర్యంలో రూ.10లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని) శుక్రవారం ప్రారంభించారు.
ముందుగా ఉప్పలపాటి సుబ్బారావు చిత్రపటానికి ఎంపీ కేశినేని చిన్ని పూలమాలేసి నివాళులర్పించారు.తెలుగుదేశం పార్టీతో దివంగత సుబ్బారావుకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన క్రమంలో బీఆరఎస్ నాయకులుగా నిరంతరం ప్రజల్లో ఉంటూ నిస్వార్థ ప్రజా సేవకులుగా సుబ్బారావు ప్రజల మనసుల్లో సుస్థిర స్థానంను సంపాదించారన్నారు. అటువంటి ఉప్పలపాటి సుబ్బారావు సంస్మరణార్థం ఆయన కుమారులు ప్రజల దాహార్తి తీర్చేలా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం సంతోషకరమంటూ ఉప్పలపాటి బ్రదర్స్‌ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో….ఉప్పలపాటి బ్రదర్స్ వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, కృష్ణయ్య ప్రముఖ వ్యాపారవేత్త నన్నపనేని శ్రీనివాసు, విస్సన్న పేట మండల పార్టీ అధ్యక్షుడు రాయల సుబ్బారావు, ఎన్టీఆర్ జిల్లా టిడిపి మాజీ ఉపాధ్యక్షుడు నెక్కలపు శ్రీను (డాబా శ్రీను), ఎన్.ఆర్.ఐ నాయకులు వల్లభనేని గిరి, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి కొత్తపల్లి ఆనంద్ స్వరూప్, గంపల గూడెం మండలం పార్టీ అధ్యక్షుడు మానికొండ రామకృష్ణ (ఎమ్.ఆర్.కె) తిరువూరు పట్టణ పార్టీ అధ్యక్షుడు మల్లెల శ్రీనివాసరావు , తెలుగుయువత రాష్ట్ర నాయకులు కవులూరి రాజా , జిల్లా నాయకులు ఆకుల రాధాకృష్ణ, తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కుక్కడపు నాగేశ్వరరావు. , మండల తెలుగు యువత నాయకులు ముత్తం శెట్టి వంశీ, టిడిపి సీనియర్ నాయకులు ఎన్.టి వెంకటేశ్వరరావు, తెలుగు యువత నాయకులు తుమ్మలపల్లి అనిల్, తుమ్మలపల్లి సునీల్ ,, మాజీ ఎంపిపి గద్దె వెంకటేశ్వరరావు, మాజీ ఎంపిటిసి కావూరి బాబు లతో పాటు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News