Breaking News

గురుకుల పాఠశాల విద్యార్థులకు అండగా నిలిచిన డాక్టర్ కాకాని తరుణ్

-రాత్రిపూట నిద్రించడానికి సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నామని అర్జీ పెట్టుకుంటే…. వెంటనే స్పందించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పిలుపుమేరకు పరుపులు అందజేసిన కాకాని ఆశయ సాధన సమితి

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బీజేపీ పార్టీ సారధ్యంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో భాగంగా జి.కొండూరు గ్రామంలో అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు బాలికలకు నిద్రించడానికి సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నామని రాత్రిపూట నిద్రించడానికి పరుపులు కావాలని నాయకులకు అర్జీలు సమర్పించారు. వెంటనే స్పందించిన బీజేపీ నాయకులు డాక్టర్ కాకాని తరుణ్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా కు సంప్రదించగా పి4 కార్యక్రమంలో భాగంగా వెంటనే స్పందించి, మహిళా దినోత్సవం పురస్కరించుకొని వేడుకల్లో భాగంగా ఏపీ బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీయన్ మాధవ్ పిలుపుమేరకు… ఎన్టీఆర్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ జన్మదిన వేడుకలు కార్యక్రమంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూన్న భాగంగా, కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షులు డా” కాకాని తరుణ్ కు పిలుపునీవ్వగా ,మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు… గురుకుల పాఠశాల విద్యార్థులకు తక్షణమే పరుపులను అందజేశారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశా జండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం బీజేపీ నాయకులు మరియు కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షులు డా” కాకాని తరుణ్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అనంతరం కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షులు డా” కాకాని తరుణ్ మీడియాతో మాట్లాడుతూ …స్వాతంత్ర్య సమరయోధుడు మరియు మాజీ క్యాబినెట్ మంత్రి కాకాని వెంకటరత్నం విలువల గురించి నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పారు మరియు కాకాని రాజకీయ మరియు సామాజిక భావజాలానికి ప్రస్తుత తరం మార్గదర్శకుడు. విజయవాడ ప్రజలు ఆయన నాయకత్వ మరియు సేవా కార్యకలాపాలను చూశారు మరియు వారి సమస్యలను పరిష్కరించడానికి ఆయన ప్రాతినిధ్యం వహించడాన్ని చూడాలని కోరుకుంటున్నారు..వారి భావజాలల్లో ముందుకు నడుస్తూ రానున్న రోజుల్లో ప్రజలకు ఇటువంటి అవసరం వచ్చిన సాయం చేయడానికి కాకాని ఆశయ సాధన సమితి ముందుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *