Breaking News

పెనుగంచిప్రోలు మండలంలో NITI Aayog అధికారి పర్యటన విజయవంతం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త :
NITI Aayog ఆధ్వర్యంలో అమలు అవుతున్న Aspirational Blocks Programme – Sampoornata Abhiyan 2.0 కార్యక్రమంలో భాగంగా NITI Aayog అధికారి రాధికా ములే (Radhika Mulay) గారు ఈ రోజు పెనుగంచిప్రోలు మండలాన్ని సందర్శించారు. పర్యటనలో భాగంగా ఆమె మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Ayushman Arogya Mandir), ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC), పశుసంవర్ధక శాఖ కార్యాలయం తదితర కేంద్రాలను సందర్శించి అక్కడ అందుతున్న సేవలు, అమలు అవుతున్న ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను పరిశీలించారు.

అదేవిధంగా శనగపాడు గ్రామంలోని గ్రామీణ కృషి పరిజ్ఞాన కేంద్రం (Gramin Krishi Parignana Kendra – GKPK) ను సందర్శించి అక్కడ రైతులకు అందిస్తున్న స్మార్ట్ అగ్రికల్చర్ శిక్షణలు, జియో ఫెన్సింగ్ వ్యవసాయ పద్ధతులు మరియు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా Aspirational Blocks Programme కింద నిర్దేశించిన Six Key Performance Indicators (KPIs) ను పూర్తి స్థాయిలో సాధించేందుకు పెనుగంచిప్రోలు మండల అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నారని రాధికా ములే గారు అభినందించారు. మండలంలో కార్యక్రమాల అమలు సమర్థవంతంగా కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ్ IAS మార్గదర్శకత్వంలో Sampoornata Abhiyan 2.0 కార్యక్రమం జిల్లాలో సమర్థవంతంగా అమలు అవుతూ మంచి ఫలితాలు సాధిస్తోందని ఆమె తెలిపారు. అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి, వివిధ శాఖల ద్వారా అమలు అవుతున్న కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అలాగే అధికారులతో పరస్పర చర్చ జరిపి వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో MPDO శ్రీను, MRO శాంతా లక్ష్మి, AO సిద్ధారెడ్డి, MAO రామసుబ్బారెడ్డి, MEO రవీంద్ర, MO నాగరాణి, ABP కోఆర్డినేటర్ మోహన్ సందీప్, డిప్యూటీ MPDOలు సుబ్బారావు, సువర్ణ రాజు, మండల పశుసంవర్ధక శాఖ అధికారి అనిల్, APM వెంకటరమణ, AE (RWS) నాంచారయ్య, AE హౌసింగ్ సతీష్, CDPO సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *