– కస్తూరిబాయిపేట సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ముగింపు కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ, కస్తూరిబాయి పేటలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం నందు ‘పాత్ మోటివేషన్ సెంటర్’ (Path Motivation Center) ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘స్వచ్ఛ స్వేచ్ఛ – బాలికా జాగృతి’ అవగాహన కార్యక్రమం శుక్రవారం ఘనంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బాలికల వసతి గృహాల్లో విద్యార్థినులకు వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా పాత్ మోటివేషన్ సెంటర్ ఎండి (M.D) ఎన్. సామేష్ మాట్లాడుతూ, కౌమార దశలో బాలికలు ఆందోళన చెందకుండా, మనోధైర్యంతో ఉండాలని సూచించారు. ముఖ్యంగా నెలసరి (Menstruation) సమయంలో పాటించవలసిన శాస్త్రీయ విధానాలు, వ్యక్తిగత పరిశుభ్రత మరియు పౌష్టికాహారం ప్రాముఖ్యతను విద్యార్థినులకు వివరించారు.
సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బి. లావణ్య వేణి, IAS (Director of Social Welfare) మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యార్థినుల భద్రత మరియు ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఇటువంటి మోటివేషన్ క్లాసులు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.డబ్ల్యూ.ఓ (ASWO) వి.ఎస్.ఎస్. గణేష్, వసతి గృహ సంక్షేమ అధికారిణి (HWO) కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మోటివేటర్లు, వసతి గృహ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News