Breaking News

డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గం, 58వ డివిజన్, పైపుల రోడ్డు సెంటర్, ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఈరోజు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం గత రెండు సంవత్సరాల నుంచి నెలలో రెండు సార్లు కొనసాగిస్తూనే ఉన్నారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు జరగాలని కోరుకుంటున్నారు. మనం చేసే ఏ మంచి పని అయినా ప్రజల గుండెల్లో గుర్తుండి పోయేలాగా చేస్తుందని మాకు ప్రభుత్వం సపోర్ట్ చేస్తే ఒక గొప్ప మహానుభావులైన సీతమ్మ పేరు మీద పెట్టిన ఈ అన్నదాన కార్యక్రమాన్ని రోజు జరిగేలా చూస్తే సేవ చేసుకోవడానికి ట్రస్ట్ మెంబర్స్ అందరూ సిద్ధంగా ఉన్నారని డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు అవుటుల్లి విజయకుమారి చెప్పారు. ఈ కార్యక్రమంలో సంసాని విజయలక్ష్మి, గుబ్బల జ్యోతి, ఎర్రోజు అభిలాష్, దాసరి ప్రశాంతి, పినపార పుణ్య లక్ష్మి దుర్గ, కానుమూరి కనకదుర్గ, మెట్టు కావ్య తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *