Breaking News

కస్టమర్ దేవుళ్ళకి సేల్స్, సర్వీస్ & హెల్త్ క్యాంప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కస్టమర్ దేవుళ్ళకి ఎప్పుడూ పెద్దపీట వేసే వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ప్రజల భద్రతలో భాగంగా వారి ఆరోగ్యం పరిరక్షణ కూడా ముఖ్యమని సేల్స్, సర్వీస్ & హెల్త్ క్యాంప్ నిర్వహించింది. శనివారం ఆటోనగర్, మెయిన్ వర్క్ షాప్, వరుణ్ బజాజ్ సర్వీస్ సెంటర్ నందు ఈ ప్రత్యేక క్యాంప్‌లో మీ ఆరోగ్యం + మీ వాహనం ఆరోగ్యం రెండింటికీ చెక్-అప్ చేసే అవకాశం కల్పించారు. మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది… మీ బండి బాగుంటే మీ ప్రయాణం సేఫ్‌గా ఉంటుంది! అనే నినాదంతో ఏర్పాటుచేసిన ఈ క్యాంప్‌లో సుమారు 90 మంది బజాజ్ కస్టమర్స్ హెల్త్ చెకప్ మరియు బజాజ్ వెహికల్ సర్వీస్ చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈ.డి.సత్యనారాయణ, బిజినెస్ హెడ్ కె.వి.రామారావు, సేల్స్ జిఎం పద్మజ, సర్వీస్ జిఎం విజయ్, మరియు బజాజ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *