విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పాలన సాగిస్తున్న టిడిపి, బిజేపి, జనసేన కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ గొల్లపాలెం గట్టు రోడ్డులో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) ఆదేశాల మేరకు ప్రజా దర్భార్ కార్యాక్రమాన్ని శనివారం నిర్వహించారు. అధికారులు, టిడిపి నాయకులు, పలువురు ప్రజా ప్రతినిధులు ప్రజల నుంచి నేరుగా విజ్ఞాపనలు స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారంకు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న స్వయంగా ప్రజల నుంచి సమస్యలతో కూడిన వినతి పత్రాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ….పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చొరవతో పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల ముంగిట్లోకే ప్రజా ప్రభుత్వం వచ్చిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పార్టీ అధిష్టానం సూచనలతో నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతంలోనూ ప్రజా దర్భార్ కార్యక్రమాలను ఎంపీ కేశినేని శివనాథ్ ఏర్పాటు చేయించి అన్ని విభాగాలకు చెందిన అధికారులను ప్రజల వద్దకే తీసుకువస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఆయా సమస్యల పరిష్కారంకు కృషి చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం టిడిపి ప్రభుత్వంలోనే సాధ్యమని ప్రజా దర్భార్‌లు రుజువు చేస్తున్నాయన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి , ఎన్టీఆర్ జిల్లా టిడిపి కార్యదర్శి పిళ్లా శీను, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సోలంకి రాజు, ఎస్సీ సెల్ సీనియర్ నాయకులు కామా దేవరాజ్, పేటేటి రాజమోహన్ , మైలపల్లి రాజు, టిడిపి సీనియర్ నాయకులు పీత బుజ్జి బంక నాగమణి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ , 50 డివిజన్ అధ్యక్షురాలు కొప్పుల అరుణ శ్రీ , డివిజన్ ప్రధాన కార్యదర్శి కాళ్ళ ఈశ్వరరావు , 144బూత్ కన్వీనర్ షేక్ మోబినా ,142బూత్ కన్వీనర్ పీత మోహన్ రావు, కొండపు బుజ్జి , వాణిజ్య విభాగం నాయకులు ధనేకుల నాని , తెలుగుయువత అధ్యక్షుడు మాధవ, ఐటీడీపి అధ్యక్షులు చైతన్య , ప్రధాన కార్యదర్శి రమేష్, శంకర్ యాదవ్, పశ్చిమ నియోజకవర్గం తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి పితాని పద్మ ,టిఎన్‌టీయూసి వైస్ ప్రెసిడెంట్ యర్రంశెట్టి పద్మ, పట్నాల భార్గవి, ఐ టి డి పి నాయకురాలు పి ప్రియాంక , కామాక్షి , 52 డివిజన్ ప్రెసిడెంట్ ఈగల్ సాంబ , 53 డివిజన్ ప్రెసిడెంట్ నందే విజయలక్ష్మి, 49 డివిజన్ ప్రెసిడెంట్ బడుగు వెంకన్న , 51 డివిజన్ ప్రెసిడెంట్ కుంచం దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News