Breaking News

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 నా జరుగుతున్న సందర్భంగా కళాశాలలోని విమెన్స్ సెల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథి గా కళాశాల పూర్వ విద్యార్థిని డాక్టర్ డి కళ్యాణి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నెల్లూరు విచ్చేశారు. గౌరవ అతిథులుగా రావూరీ సూయాజ్ ,మార్పు ట్రస్టు డైరెక్టర్,మరియు ,సిస్టర్ అమల ఆడిట్ హెడ్ నిర్మల నికేతన్ విచ్చేశారు. డాక్టర్ సిస్టర్ లేన క్వాడ్రస్ విద్యార్థినులు కు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ మాట్లాడుతూ విద్యార్థులందరూ విద్య అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్ని రంగాలలో రాణించాలని మహిళా ల హక్కులు గురించి తెలుసుకోవాలని క్రమ శిక్షణ తో కూడిన జీవితం అలవర్చుకోవాలన్నారు. డాక్టర్ కళ్యాణి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం – మార్చి 8.జరుపుకుంటున్న సందర్భం గా దానిని కేవలం పండుగ చేసుకునే రోజు గా కాకుండా మన హక్కులను, బాధ్యతలను గుర్తుచేసుకునే రోజు. ఒక న్యాయవాదిగా మహిళల గురించి మాట్లాడటం, వారి హక్కుల గురించి చర్చించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను అని దూసుకుపోతున్నా, ఇంకా లింగ వివక్ష, హింస, వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టడానికి చట్టాలు ఉన్నాయి, కానీ అవగాహన ముఖ్యం. మన చుట్టూ ఉన్న మహిళలు, బాలికలు తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేలా, న్యాయం పొందేలా ప్రోత్సహించాలి అని మహిళా సాధికారత వైపు అడుగులు వేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమం లో కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపకులందరి చే “మహిళలు వారియర్స్ గా ముందుకు సాగిపోతాం ప్రతి సమస్యని ధైర్యంగా ఎదుర్కుంటాం అని మేమంతా విక్టిమ్స్ కాదు యోధులం అని ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల విమెన్ సెల్ సభ్యులు వై సుప్రియ ఆంగ్ల వి భాగాధిపతి, డాక్టర్ బ్యూలా నోయెల్ హిస్టరీ అండ్ టూరిజం విభాగాధిపతి,, శాంత కుమారి సీనియర్ ఫ్యాక్టులీ డిగ్రీ వైస్ ప్రిన్సిపాల్ జీ.ఉష కుమారి, డాక్టర్ సిస్టర్ ఆశ, ఇంటర్ వైస్ ప్రిన్సిపాల్ స్వప్న వున్నాం ఇతర అధ్యాపకులు విద్యార్థినులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *