Breaking News

యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో జిల్లాలోనే విఎంసి ప్రథమ స్థానం

-స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డ్ డైరెక్టర్ శివప్రసాద్ ఐఎఫ్ఎస్ స్వీయ పరిశీలన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో జిల్లాలోనే విఎంసి ప్రథమ స్థానంలో ఉన్నందుకు స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డ్ డైరెక్టర్ శివప్రసాద్ ఐఎఫ్ఎస్ విజయవాడ నగరపాలక సంస్థను అభినందించారు. ఆదివారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్, జోనల్ కమిషనర్ కె. షమ్మీ ఆధ్వర్యంలో పటమటలో తానే స్వయంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేశారు.

ఈ సందర్భంగా స్వర్ణ గ్రామం స్వర్ణ అవార్డ్ డైరెక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం తీసుకొచ్చిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఎంతో ముఖ్యమైన సర్వే అని, ఇటువంటి సర్వేలు ప్రభుత్వం ప్రజల వద్దకు తీసుకువస్తే ప్రజలు సచివాలయం కార్యదర్శులకు సహకరించి వివరాలను అందజేయాలని, ఈ సర్వేలు కేవలం ప్రజల అభివృద్ధి మరియు సంక్షేమం కోసమే జరుగుతుందని, అందువలన ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించి ఈ సర్వేలను దిగ్విజయం చేయవలసిందిగా విన్నవించారు.

ఈ పర్యటనలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపాల నాయక్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *