Breaking News

విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

-అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలకు చర్యలు -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు నగరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మూడు నియోజకవర్గాలలో కూడా ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించగా సర్కిల్ 1 పరిధిలో గల పున్నమి ఘాట్లో, సర్కిల్ టు పరిధిలో రాజీవ్ నగర్ లో, సర్కిల్ 3 పరిధిలో పటమట లో ప్రజా ప్రతినిధులు, మహిళలు పాల్గొని విజయవంతం చేశారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు.

నగర పరిధిలో గల మూడు సర్కిల్లో లోను ఉత్తమ ప్రతిభావంతులైన స్వయం సహాయక బృందాల వ్యాపారవేత్తలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం లైవ్ లో వారికి వినిపించి, ముఖ్యమంత్రి గారి స్ఫూర్తి దాయకమైన ప్రసంగం ద్వారా వారికి స్ఫూర్తినిచ్చామని అన్నారు.

మార్చి 8, 2026 తో మొదలుకొని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వారోత్సవాలుగా జరుపుకుంటున్నామని, అందులో భాగంగా మహిళలకు ప్రత్యేకమైన నైపుణ్య శిక్షణలు, మహిళల నేతృత్వంలో స్వచ్ఛత కార్యక్రమాలు, సఫాయి మిత్రా సురక్ష సిబిర్లో భాగంగా మహిళల ఆరోగ్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతున్నామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *