-నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థ కొల్లి శారద హోల్ సేల్ కూరగాయల మార్కెట్ లోని వర్తకులు, రైతులకు, ముఠా కూలీలకు ఎటువంటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) అన్నారు. తొలత హోల్ సేల్ మార్కెట్లోని షాపుల యజమానులు, రైతులు మరియు ముఠా కూలీలతో ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, కొల్లి శారద హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఎంతో ప్రాధాన్యం కలిగి ఉందన్నారు. సదరు మార్కెట్ నకు వివిధ ప్రాంతాల నుండి రైతులు, వ్యాపారస్తులు వస్తూ ఉంటారని, కావున వారికి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవలసిన బాధ్యత నగర పాలక సంస్థ పై ఉందన్నారు. మార్కెట్ నందు వ్యాపార నిర్వహణలో కాని, మౌలిక సదుపాయాల పై కాని సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తేవాలని, సదరు సమస్యలను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటామన్నారు.
Prajavartha Online Telugu News