Breaking News

ఢిల్లీ లిక్కర్ కేసు-విచారణ సంస్థల పాత్ర పై అఖిల పక్ష సమావేశం 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఢిల్లీ లిక్కర్ కేసు-విచారణ సంస్థల పాత్ర, దేశంలోని స్వతంత్ర విచారణ సంస్థలు రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్నాయా అనే అంశాలపై అదివారం గాంధీనగర్ లోని విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఢిల్లీ మద్యం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ నేత అరవింద్ కేజ్రీవాల్ పై పెట్టిన కేసును ప్రత్యేక కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో విచారణ సంస్థల పాత్రపై ఈ చర్చ నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ అమెరికా విచారణ సంస్థలు అదానీ సంస్థలు అనాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రూ.1750 కోట్ల లంచాలు ఇచ్చినట్లు సాక్ష్యాలతో సహా కేసులు పెట్టినా, దేశీయ సంస్థలు విచారణ చేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎలాంటి ప్రత్యక్ష సాక్ష్యాలు లేకపోయినా కేజ్రివాల్ను వేధించడం ఏంటని ప్రశ్నించారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు ఉప్పులేటి దేవి ప్రసాద్ మాట్లాడుతూ విచారణ సంస్థలపై పర్యవేక్షణకు ఒక స్వతంత్ర వ్యవస్థ ఉండాలని, నియామకాలలో కూడా సరైన నిర్ణయం ఉండాలని సూచించారు. ప్రముఖ న్యాయవాది పిచుక శ్రీనివాస్ మాట్లాడుతూ విచారణ సంస్థలు రాజకీయ ప్రభావాలకు లోనుకాకుండా రాజ్యాంగబద్ధంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులు మీసాల రాజేశ్వరరావు మాట్లాడుతూ అవినీతి ఆరోపణలున్న నాయకులు బీజేపీలో చేరగానే కేసులు నిలిచిపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు రూబెన్, రాచపూడి నరసింహారావు, పర్వతనేని హరికృష్ణ, షేక్ బడే సాహెబ్ మరియు  ఇతర మేధావులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *